కర్నూలు జిల్లా కలెక్టర్ ని కలిసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కల్లూరు : బస్తీపాడు గ్రామంలో కే.రామ్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలుగా “చౌక (రెషన్) దుకాణం” (పౌర సరఫరాల సంస్థ)నకు డీలర్ గా పని చేస్తున్నారు.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రేషన్ డీలర్లను తొలగించడానికి అక్రమ కుట్రలు చేస్తున్నారు. డీలర్ కే.రామ్మోహన్ రెడ్డి కి పంచనామలో ఆవాస్తవిక సరుకుల తేడాను పొందుపరిచి షోకాజ్ నోటీసులు జారీ చేసి వీరిపై దౌర్జన్యం చేశారు.. అనంతరం అందరి సమక్షంలో వీ.ఆర్.ఓ. సరుకులు స్వాధీనం చేసుకొనుటకు సరి చూస్తుండగా డీలర్ మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పై టిడిపి నాయకులు దాడి చేశారు.. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ని కలిసి వారి పై తగు చర్యలు తీసుకోవాలి అని అర్జీ అందజేశారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.