జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఆప్టా డైరీ .. క్యాలేండర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేటి సాయంత్రం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) 2025 డైరీ మరియు కేలండర్ జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాష చే ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఉపాద్యాయుల పాత్ర చాలా కీలకం అయినది. తల్లి తండ్రులు తరువాత గురువు లదే ఉన్నత స్థానం. తాను ఈ స్థాయి కి రావడం లో గురువుల ప్రోత్సాహం మరియు వారి ఆదరణ ఏంతో కీలకమైనవి అని అన్నారు.ఈ కార్యక్రమము లో ఆఫ్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు, రాష్ట్ర నాయకులు పి రాజసాగర్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిమహమ్మద్ రఫీ , సీనియర్ నాయకుడు మహబూబ్ భాష పాల్గొన్నారు.