ఎంఎస్ఎంఇ యూనిట్ల సర్వే పూర్తి చేయండి…
1 min readవయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దండి.
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సంబంధించి పెండింగ్లో ఉన్న సర్వేను ఈ నెల 31వ తేదీలోగా సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లతో పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో ఇంకా 65 వేల యూనిట్ల సర్వే పెండింగ్ ఉందని సచివాలయ సర్వే వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా కమర్షియల్ విద్యుత్ యూనిట్లకు సంబంధించిన డేటాను పంపామని గ్రామ/వార్డు సచివాలయాల వారీగా విభజించి సర్వేలను పూర్తి చేయాలని ఎంపీడీఓ, తాసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దండి
15 నుండి 50 సంవత్సరాలలోపు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని స్వయం సహాయక బృందాల సభ్యులను కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాలు ఈనెల 23 నుండి ప్రారంభమవుతాయన్నారు. ప్రతి 10 మంది నిరక్షరాసులైన వయోజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఒక వాలంటరీ టీచర్ ఉంటారని…. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిర్వహించే ఈ కేంద్రాలను జిల్లా అధికారులు సందర్శించి ప్రోత్సహించాలన్నారు. మార్చి 31వ తేదీలోగా 26,000 మంది నిరక్షరాస్యులకు తెలుగులో సంతకం పెట్టడమే కాకుండా అక్షరాలను గుర్తుపట్టేలా నేర్పించాలన్నారు. మార్చి 31 తర్వాత నిర్వహించే ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా శిక్షణనివ్వాలన్నారు.