విశ్వబ్రాహ్మణుల పితామహుడు గానాల రామ్మూర్తి ఆశయాలను నెరవేరుద్దాం
1 min readజాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు యాదవ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ లోని బీసీ భవన్ నందు విశ్వబ్రాహ్మణుల పితామహుడు గానాల రామ్మూర్తి జయంతి సందర్బంగా నివాళులు లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, బ్రహ్మయ్య చారి, రాంబాబు, వెంకటేశ్వర్లు, పట్నం రాజేశ్వరి,శ్రీనివాసులు, ఆనంద్ మొదలైన బీసీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా, కేంద్ర ప్రభుత్వ స్థాయి లో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీలు అన్ని కులాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా ఎదగడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని నెలకొల్పడం జరిగింది. ఉద్యమ ఫలితంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు రక్షణ చట్టం తెస్తానని చెప్పడం జరిగింది. బీసీలలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం, 37 వేల కోట్లు బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ను ఇస్తానని చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల్లో బీసీ భవన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు బీసీలకు 50% శాతం ఇస్తాను అని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం 24% ఇస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం జరిగింది. బీసీల అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబునాయుడు కి లోకేష్ బాబు కి ప్రత్యేక ధన్యవాదములు ఈ సందర్భంగా తెలియజేశారు. బీసీల యొక్క డిమాండ్లను కూటమి ప్రభుత్వానికి ఇంతకుమునుపే సమర్పించడం జరిగింది. దానిని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా నేను చేస్తున్నాం అలాగే బీసీల కులగననా వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు.