రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం
1 min readజనవరి 16నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగముగా ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తముగా రహదారి భద్రతా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రవాణా శాఖ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలియజేశారు. ఏలూరు ఆర్డీఓ డిపోలో డ్రైవర్లు, క్లీనర్ ర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను పాటించి నిర్దేశించిన వేగం మించకుండా వాహనాలను నడపాలన్నారు. ఏలూరు జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దెందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. రహదారి భద్రతా నియమాలను తెలియజేసారు.అనంతరం ఉప రవాణా కమీషనర్ కార్యాలయానికి డ్రైవింగ్ లైసెన్స్ నిమిత్తం దరఖాస్తు చేసుకుని హాజరైన వారికి రహదారి చిహ్నాలు, రహదారి భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు తెలియజేసారు. రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు డ్రైవింగ్ చేసే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు.అనంతరం ఏలూరు పాత బస్టాండ్ వద్ద రోడ్ సిఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించి హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న, రాష్ డ్రైవింగ్ చేస్తున్నవారిపై మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై కేసులు నమోదు చేశారు. అదేవిధముగా హెల్మెట్ వినియోగము వలన కలిగే ప్రయోజనాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను ద్విచక్ర వాహనదారులకు వివరించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడముతో పాటూ, జాతీయ రహదారి వారోత్సవాల కరపత్రాలను వాహన చోదకులకు అందించారు. ఈ కార్యక్రమాలలో ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బి.వాణి మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు జగదీష్ బాబు, ప్రజ్ఞ, అజ్మీరా బద్దు, జమీర్, ఎస్. జగదీష్ బాబు, జి. స్వామి, కళ్యాణి, నరేంద్ర బాబు, పాల్గొన్నారు.