ప్రతి అర్జీకి అర్ధవంతమైన సమాచారం అందజేయాలి
1 min readపిజిఆర్ ఎస్ కు 247 అర్జీలు
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: వివిధ సమస్యల పరిష్కారంకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(పిజిఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలకు అర్ధవంతమైన పరిష్కారం చూపుతూ అర్జీదారుని సంతృప్త స్థాయి పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ లో వివిధ సమస్యలపై ప్రజల నుండి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం, ముక్కంటి, కె. భాస్కర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పిజిఆర్ఎస్ లో 247 అర్జీలు అందినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారతీరును సిఎంఓ కార్యాలయ స్ధాయినుంచి జిల్లాస్ధాయి వరకు పరిశీలించడం జరుగుతుందన్నారు. అధికారులు అర్జీల పరిష్కారంలో ఎటువంటి లోపం లేకుండా క్షేత్రస్ధాయిలో విచారించి నాణ్యమైన రీతిలో పరిష్కరించాలన్నారు.
అందిన అర్జీలలో కొన్ని
వట్లూరు గ్రామానికి చెందిన ఉదయ భాస్కరరావు రెండు నెలలు క్రితం తమకు యాక్సిడెంట్ అయి కాలుతీసివేసినారు. నాకు ఎటువంటి అర్ధికంగా ఆధారంలేదని, కావున ప్రభుత్వంవారు కల్పిస్తున్న ఫించన్ ను అందజేయాలని కోరుతూ అర్జీని అందజేశారు. కొత్తవారిగూడెంకు చెందిన రాధామనోహర్ తన తండ్రి మరణ ధృవీకరణ పత్రాన్ని ఇప్పించమని అర్జీని అందజేశారు. కన్నాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ స్మశనానికి వెళ్లుమార్గాన్ని ఆక్రమించుకున్నారని, ఆక్రమణ తొలగించి గ్రామ ప్రజల సమస్యను తీర్చమని అర్జీ అందజేశారు. అడవికొలనుకు చెందిన మోషే తమ గ్రామపంచాయితీ పరిధిలో పాత ఎస్సీ కాలనీలో గ్రామకంఠం మరియు అక్రమకట్టడాలు, ఆక్రమణలు తొలగించాలని, పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశుభ్రం చేయాలని రోడ్డుకు అడ్డుగావున్న చికెన్ షాపును తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు. లోపూడి గ్రామానికి చెందిన పి. నిర్మలాదేవి తమ ఆర్.ఎస్. నెం.263లో 4.60 సెంట్లు భూమి ఆన్ లైన్ చేయవల్సిందిగా కోరుతూ అర్జీ అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.