PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎప్పటికైనా రాష్ట్ర గౌరవాన్ని, హక్కులను కాపాడేది చంద్రబాబు

1 min read

 వైకుంఠం శివ ప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : విశాఖ ఉక్కు కర్మాగారానికి పునర్వైభవం తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది.జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కుని అమ్మకానికి పెడితే, చంద్రబాబు రాష్ట్రానికే మణిహారమైన ప్లాంట్ ను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించారు. ఆంధ్ర రాష్ట్రానికే మణిహారమైన విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవానికి, కేంద్రప్రభుత్వం అందించిన ఆర్థిక ప్యాకేజీ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు  పట్టుదల, కృషి ఎంతో ఉన్నాయని చెప్పడానికి గర్విస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివ ప్రసాద్ తెలిపారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నానుడిని శాశ్వతం చేస్తూ, ఆంధ్రులందరూ గర్వంతో ఛాతీ ఉప్పొంగేలా చేసిన ఘనత ప్రజల ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తిరిగి నిలబెట్టిన చంద్రబాబు  కార్యాచరణపై రాష్ట్రప్రజానీకం నుంచి ప్రశంశల వర్షం కురుస్తోంది.  తనపై ఉన్న అవినీతి కేసుల్ని తొలగిస్తే, ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ… రాష్ట్రమే తన కుటుంబం… రాష్ట్రాభివృద్ధే తన సంకల్పమంటూ అడుగులు వేస్తున్న చంద్రబాబు ఎక్కడా అని ఆంద్రులతో పాటు ప్రపంచంలోని తెలుగుజాతి మొత్తం ముక్తకంఠంతో నినదిస్తోంది.

కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగితే, వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని, రాష్ట్ర వినాశనాన్ని సరిచేసేందుకు చంద్రబాబు  కేంద్రప్రభుత్వాన్ని  ఒప్పిస్తున్నారు. ఆంధ్రుల హక్కుని జగన్ రెడ్డి తనస్వార్థం కోసం అమ్మకానికి పెడితే, అదే హక్కుని కాపాడేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమించారనేది ముమ్మాటికీ వాస్తవం. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కుఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత పాలకుల నిర్లక్ష్యం, అత్యాశ కారణంగా మూతపడే స్థితికి చేరింది. ప్లాంట్ పునర్వైభవానికి చేయూత నివ్వాలని కార్మికులు రోడ్డెక్కి, ధర్నాలుచేసినా జగన్ సర్కార్ ఖాతరుచేయలేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు పోలవరం, అమరావతి నిర్మాణాలతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవంపై దృష్టిపెట్టింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రధాని, కేంద్రమంత్రులకు విశాఖ ఉక్కును ఆదుకోవాలని చేసిన విజ్ఞప్తులు ఫలించాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో మాదిరి కార్యకలాపాలు కొనసాగించాలంటే కనీసం రూ.18వేల కోట్ల వరకు సాయం అవసరమని గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కుశాఖమంత్రి కుమారస్వామికి టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ లు విన్నవించారు. వారు కోరిన కొద్దిరోజులకే కేంద్రం ఎమర్జన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద, జీఎస్టీ చెల్లింపులకోసం రూ.500 కోట్లు, ముడిసరుకుకు సంబంధించి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.1150 కోట్లు, మొత్తంగా రూ.1650 కోట్లను రెండు విడతల్లో కేంద్రం అందించింది. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మరలా కేంద్రంతో సంప్రదింపులు జరిపిన మీదట తాజాగా కేంద్రప్రభుత్వం ఒకేసారి రూ.11,440కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం నిజంగా అభినందనీయం.

1994లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బారినుంచి, 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి నుంచి విశాఖ ఉక్కుని కాపాడిన ఘనుడు చంద్రబాబే….గతంలో 1994లో కూడా విశాఖ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిన సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమ్మడానికి ప్రయత్నించింది. ఆనాడు స్వర్గీయ ఎర్రన్నాయుడి నేత్రత్వంలోని టీడీపీ ఎంపీల బృందం చేసిన పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ వెనక్కు తగ్గింది. అనంతరం 1998లో నాటి ప్రధాని వాజ్ పేయ్ గారిని ఒప్పించి, రూ.1650 కోట్ల కేంద్ర సాయాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించారు. కేంద్రం ఇచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చి, వడ్డీని మాఫీ చేయాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం కోరడంతో నాడు ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ రూ.1333 కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చి, విశాఖస్టీల్ ప్లాంట్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీని కూడా ఏర్పాటుచేశారు. ఆనాడు కేంద్రమిచ్చిన చేయూతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా కృషి చేసింది. ఆనాడు నష్టాల్లో ఉన్న ప్లాంట్ ను రక్షించింది చంద్రబాబే.. నేడు అదే ప్లాంట్ కు పునరుజ్జీవం కల్పించి,  పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర సాయం సాధించింది చంద్రబాబే.   అప్పుడైనా… ఇప్పుడైనా….. మరెప్పుడైనా రాష్ట్ర గౌరవాన్ని… హక్కులను కాపాడేది చంద్రబాబునాయుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కేవలం ఉనికికోసం, రాజకీయ ప్రాపకం కోసం చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరు అని వైకుంఠం శివ ప్రసాద్  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *