కర్నూలు జీజీహెచ్‌లో నూతన వెల్నెస్ క్లినిక్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ:ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్ర విజన్ -2047ను రూపొందించిన, విక్షిత్ భారత్ ఫ్రేమ్‌వర్క్‌కు లో భాగంగా ఈ రోజు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన వెల్నెస్ క్లినిక్‌ను కేఎంసి ప్రిన్సిపల్, డా. చిట్టి నరసమ్మ చేతుల మీదగా ప్రారంభించినట్లు తెలిపారు.ఆధునిక జీవనశైలి లో మధుమేహం, రక్తపోటు మరియు గుండె, స్థూలకాల కాయం, కిడ్నీ వ్యాధుల వంటి పరిస్థితుల దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని చురుగ్గా నిర్వహించడానికి మరియు ముందస్తుగా వచ్చే అనారోగ్యా సమస్యలను నివారించడానికి ఈ ఒపి సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు.కమ్యూనిటీ మెడిసిన్ విభాగము లో ఉండే వైద్య సిబ్బంది మరియు వైద్య నిపుణులు, డైటీషియన్లు, మెడికల్ సోషల్ వర్కర్, నర్సింగ్ సిబ్బందితొ ఈ క్లినిక్ ఒపి 333 లో ప్రతి సోమవారం మరియు బుధవారం ఔట్ పేషెంట్ ఒీపి సేవలు అందుబాటులో ఉంటాయి అని అన్నారు.ఈ కార్యక్రమానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చిట్టి నరసమ్మ, డిప్యూటీ సూపరింటెండెంట్, డా.శ్రీరాములు, సీఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, పి.సింధు సుబ్రహ్మణ్యం, SPM విభాగాధిపతి, డా.సుధ కుమారి, SPM ప్రొఫెసర్, సింధియా శుభప్రద, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రి బాయి, మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.