పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కే.ఈ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ నియోజకవర్గం, మద్దికేర మండలంలో స్థానిక ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించారు. మద్దికెరలో మార్కెట్ యార్డ్ నందు 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కమర్షియల్ షాపులను ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ చేత ప్రారంభించారు. అలాగే మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో నిర్మించిన వివిధ సిసి రోడ్లు, మురుగునీటి కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు ధనుంజయ, తుగ్గలి నాగేంద్ర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.