బిజెపి నూతన జిల్లా అధ్యక్షులుగా అక్కమ్మ తోట రామకృష్ణ
1 min readబిజెపి రాష్ట్ర పార్టీకి మరియు జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసిన
కౌతాళం బిజెపి మండల అధ్యక్షులు వెంకన్న
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రం అక్కమ్మ తోట నందు మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కౌతాళం మండల బిజేపి అధ్యక్షులు యంకన్న మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన కౌతాళం మండలం నుంచి అక్కమ్మ తోట రామకృష్ణ ఒక సాధారణ కార్యకర్త గా బిజెపిలో తన ప్రస్థానం మొదలుపెట్టడం జరిగింది.అక్కడి నుండి మండల కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి మరియు నియోజకవర్గ కన్వీనర్ గా బిజెపిలోని అనేక బాధ్యతలను చేపట్టి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మరియు ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి,ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపిలోని అనేక బాధ్యతలను చేపట్టి తనకు పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ దిగ్విజయంగా వాటిని పూర్తి చేసి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బిజెపి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అక్కమ్మ తోట రామకృష్ణ గారని అన్నారు. బిజెపి పార్టీ రామకృష్ణ సేవలను గుర్తించి జిల్లాలోని అందరూ బిజెపి సీనియర్ నాయకులు, పార్టీ పెద్దలు కలిసి కర్నూల్ జిల్లా బిజేపి అధ్యక్ష పదవిని ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందని కౌతాళం మండల బిజేపి అధ్యక్షులు వెంకన్న తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లింగన్న, విజయ్,రాజు,జంగ్లీ భాష,ఈరన్న,లింగన్న,తరుణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.