రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి… ఏడిఆర్ జాన్సన్
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని అప్పుడే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని నంద్యాల ఆర్ ఏ ఆర్ ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఏడిఆర్ జాన్సన్ బుధవారం పేర్కొన్నారు. మండలంలోని బొల్లవరం గ్రామంలో పొలం బడిలో భాగంగా రబీ సీజన్ లో వేసిన వరి పంటను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో పచ్చి రోడ్డ సాగు చేయాలన్నారు. దీనిని దమ్ము చేసిన అనంతరం వరి నాటు వేసే ముందు భూమిలో ఫొటోస్, యూరియా, భాస్వరం వేయాలన్నారు. నాటు వేసిన 30 రోజులకు యూరియా, పొటాష్ పై పాటుగా వేయాలన్నారు. పొట్ట దశలో మరోసారి యూరియా మరియు ఫొటోస్ పై పాటుగా వేయాలని భాస్పరాన్ని అధిక శాతం పై పాటుగా వేస్తే మొక్కలు తీసుకోవని అది భూమిలోనే ఉండిపోతుంది అని దానివల్ల రైతులకు నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇవే పద్ధతులు రబీ సీజన్లో పాటించాలన్నారు. ప్రస్తుతం పరిశీలించిన వరి పొలంలో బాస్పర శాతం అధిక మొత్తములో పేరుకు పోయిందన్నారు. దీనివల్ల వేర్లు నల్లబడి ఎదుగుదల నిలిచిపోతుందన్నారు. అగ్గి మచ్చ తెగులు వల్ల ఆకులు గిడస భారీ పోతున్నాయని దీనికి తెగుళ్ల మందు పిచికారి చేయాలన్నారు. లద్దె పురుగు ఆకుముడుత పురుగు ఉన్నాయని గుళికలతో పాటు పురుగు మందులను వాడాలని సూచించారు. వీటన్నిటితోపాటు జింకు లోపం కూడా ఉందని జింకు సల్ఫేట్ ను మొదటనే నాటు వేసే ముందే భూమిలో వేసి ఉండాల్సింది అన్నారు. మార్కెట్లో లభిస్తున్న జింకు పిచికారి చేయాలన్నారు. అనంతరం పొలంలో నిలువ ఉన్న నీటితోపాటు వ్యవసాయ బావిలోని నీటిని కూడా పరీక్షించారు. పొలంలో నీటిని పరిశీలించగా ఉప్పు శాతం అధికంగా ఉందన్నారు. ఎడాపెడా పాస్పెట్ వెదజల్లడం వల్ల భూమిలో ఉప్పు శాతం పెరిగిపోయింది అన్నారు ఈ కార్యక్రమంలో ఏడిఏ రాజశేఖర్ శాస్త్రవేత్తలు రవికుమార్.