అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
1 min readఉత్సవాలకు రావాలని ఆహ్వానం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు
ఫిబ్రవరి 4వ తేదీ నుండి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: కోరికలు తీర్చే కల్పవల్లిగా సంతాన లక్ష్మిగా చల్లని తల్లిగా పేరుపొందిన దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామ దేవత శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలను ఫిబ్రవరి 4వ తేదీ నుండి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవ మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి గోడ పత్రికలను (వాల్పోస్టర్లను) బుధవారం ఆయన నివాసంలో విడుదల చేశారు. సందర్భంగా గాలయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు ఆ రావాల్సిందిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.