వలసలు వెళ్లొద్దు….
1 min readఉపాధి హామీ పనులు సీజనల్ హాస్టల్ లను ఉపయోగించుకోండి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: వలసలు వెళ్ళొద్దని ప్రభుత్వం ఉపాధి హామీ పనులు కల్పిస్తుందని విద్యార్థిని విద్యార్థులకు సైతం సీజనల్ ఏర్పాటు చేయడం జరిగిందని మండల ప్రజలు దినియం చేసుకోవాలని సీఆర్పీలు లక్ష్మప్ప, తుకారం, రేణుకలు కోరారు బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పొన్నూరు క్యాంపులో గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలసలు వెళ్లడం వల్ల అనేక రోగాల బారిన పడి కుటుంబాల చిన్నపిన్నమవుతాయని అదేవిధంగా మీ యొక్క పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంది విద్యకు దూరమవుతారని గుర్తు చేశారు మండల కేంద్రమైన హోళగుందలో సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం వలసలు నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఉపాధి హామీ పనులలో ప్రతి ఒక్కరికి పనికి తగిన వేతనం దొరుకుతుందని, బొంబాయి హైదరాబాద్, బెంగళూరు సుదూర ప్రాంతాలలో వలసలు వెళ్లి అధిక ఖర్చులతో వ్యయ ప్రయాసలు పడటం కంటే మన గ్రామంలోని ఉపాధి హామీ పనులను, సీజనల్ హాస్టల్స్ ను ఉపయోగించుకుని కుటుంబాల చిన్నపిన్నం కాకుండా పిల్ల పాపలు సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.