ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా బిజెపి అధ్యక్షులు
1 min readకూటమి ప్రభుత్వంలో మనమంతా ఐకమత్యంగా పనిచేద్దాం
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తుంది అనడంలో వాటి నిదర్శనాలు ఇలాగె ఉంటాయని, కూటమి ప్రభుత్వంలో మనమంతా ఐక్యమత్యంతో కలిసికట్టుగా పని చేద్దామని. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అన్నారు. రెండవసారి జిల్లా బిజెపికి జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమని ప్రశంసించారు. పవర్ పేటలో బడేటి క్యాంప్ కార్యాలయంలో బుధవారం బిజెపి జిల్లా అధ్యక్షులుగా రెండోసారి నియమితులైన సందర్భంగా చౌటపల్లి విక్రమ్ కిషోర్ ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ని మర్యాదపూర్వకంగా పలువురు బిజెపి నాయకులు కలిశారు.