రెగ్యులర్ ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేసిన ఎంపిడిఓ కు ధన్యవాదలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద మండలంలో రెగ్యులర్ ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేసిన ఎంపిడిఓ ను ధన్యవాదలు తెలిపిన ఎస్డీపిఐ నాయకులు , ఆలూరు అసెంబ్లీ అద్యక్షులు హమీద్, ప్రధాన కార్యదర్శి ఎన్. సుబాన్, కార్యదర్శి కే. సలాం మాట్లాడుతు , గత రెండు నెలల క్రితం 27-11-2024 నాడు ఎస్డీపిఐ నాయకులూ స్థానిక ఎంపిడిఓ ను రెగ్యులర్ ఆధార్ సెంటర్ లేనందున ప్రజలు ఆధార్ కార్డు అప్డేట్ కొసం ఆలూరు, ఆదోని, లకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని , రెగ్యులర్ ఆధార్ కార్డు సెంటర్ ఏర్పాటు చేయాలనీ ఆర్జీ ఇవ్వడం జరిగిందని . ఈరోజు ఎంపిడిఓ ను రెగ్యులర్ ఆధార్ కార్డు అప్డేట్ సెంటర్ గురించీ వివరణ కోరగా ఎంపిడిఓ మాట్లాడుతు సమస్యను గమనించి మండలంలో 3 చోట్లా హోళగుంద(సచివాలయం 3) హెబ్బటo, చిన్నాహ్యట ల లో రెగ్యులర్ ఆధార్ కార్డు సెంటర్ ఏర్పాటు చేశామని, తెలిపారు ప్రజలు ఈ అవాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యను గమనించి రెగ్యులర్ ఆధార్ కార్డు అప్డేట్ సెంటరు ఏర్పాటు చేయించిన హొలగుంద ఎంపిడిఓ ను ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ నాయకులు,కార్యకర్తలు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సలాం, మెహ్పోజ్, వాజిద్ పాల్గొన్నారు.