విద్యార్థులు వర్సిటీ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పిలుపునిచ్చారు. స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్, హైదరాబాదు అధినేత ఎస్. మోహన్ నాయుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడే 7 లక్షల విలువైన పుస్తకాలను యూనివర్సిటీ లైబ్రరీకి బహూకరించారని ఆయన తెలిపారు. 10 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు 3 లక్షల విలువైన పుస్తకాలను వ్యక్తిగతంగా అందించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం శాసనసభ్యులు గౌరుచరితారెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ఐ.టి. మరియు విద్యశాఖామాత్యులు నారాలోకేష్ జన్మదినం సందర్భంగా విశ్వవిద్యాలయంలో పుస్తకాలపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ యాజమాన్యాన్ని పాణ్యం శాసనసభ్యురాలు గౌరుచరితారెడ్డి ప్రశంసించారు. విద్యార్థులు ఉన్నత వ్యక్తిత్వంతో ఉత్తమ వ్యక్తులుగా తయారుకావాలని కోడుమూరు శాసనసభ్యులు బొగ్గులదస్తగిరి ఆకాంక్షించారు. తల్లిదండ్రులతోపాటు విశ్వవిద్యాలయానికి పేరుతెచ్చేవిధంగా విద్యార్థులు నడుచుకోవాలని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య పిలుపునిచ్చారు. వి.సి. ఆదేశాలమేరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతోకలిసి అతిథులు జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో వర్సిటీ లైబ్రరీ ఎదుట మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ బోధనా సిబ్బందితోపాటు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.