ఎంఎస్ఆర్ ఆఫీస్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
1 min readటిడిపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి APSSDCL చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు “జన్మదినం” సందర్భంగా గురువారం డోన్ పట్టణంలోని ఎంఎస్ఆర్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి టిడిపి నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి, జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.పి ఆర్.ఈ.రాఘవేంద్ర , డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు , రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు ,ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య , అడ్వకేట్ ఆలా మల్లిఖార్జున రెడ్డి , తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి మరియు టిడిపి నాయకులు హాజరయ్యారు.