బాలికల హక్కులు కాపాడటం మనందరి బాధ్యత
1 min readఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి
జనవరి 24 జాతీయ బాలల దినోత్సవం
గోడపత్రికలను ఆవిష్కరించిన జేసి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్రో చైల్డ్ గ్రూప్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికల(పోస్టర్స్)ను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి మాట్లాడుతూ బాలికల హక్కులు కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, బాలికల బంగారు భవిష్యత్తు కోసం వారి భద్రత ఆరోగ్యం విధ్య పై అందరూ భాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతల రమేష్ బాబు, కోశాధికారి జాగర్లమూడి శివ కృష్ణ ,చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ (క్రాప్) జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్ రవిబాబు, న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు, ఆపిల్ సంస్థ ప్రతినిధి ఆనం భీమరాజు, బయ్యే వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.