ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : చైతన్య రథంతో తాత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతేవస్తున్నా మీకోసం అంటూ పాదయాత్రతో తండ్రి ఆత్మవిశ్వాసం నింపితేయువగళం అంటూ కదం తొక్కి, భవిష్యత్తుపై భావితరాలకు భరోసా కల్పించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.నేటి రాజకీయ, ప్రజా జీవితంలో తనను తాను కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ నేటి యువతకు దిక్సూచిగా నిలుస్తూ.. తాత, తండ్రి వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్న నారా లోకేష్ బాబు కి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.ఈ రోజు హెబ్బటం గ్రామంలోని స్థానిక బస్టాండ్ నందున్న జండా కట్ట దగ్గర కేకు కటింగ్ చేసి వేడుకలు జరుపుకున్న టీడీపీ యువ నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.