ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
1 min readవైకుంఠం శివ ప్రసాద
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు పట్టనం లొనివైకుంఠ శివ ప్రసాద స్వగృహం నుండి బారి బైక్ ర్యాలీ నిర్వహించి ,ఆదోని రోడ్డు సమీపం లొ ఉన్న శ్రీ సాయి బాబా మందిరం , కోటవీధి లొ వెలసిన శ్రీ సుంకుల పరమేశ్వరి ఆలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదిన సంద్భంగా ఆలయాల లో ప్రతేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట కార్యనిర్వహక కార్యదర్శిశ్రీ వైకుంఠం శివ ప్రసాద , టీడీపి మహిళా నాయకురాలు శ్రీమతి వైకుంఠం జ్యోతీ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్శ్రీమతి కప్పట్రాల బోజమ్మ టీడీపి సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు యువ నాయకులు యువతరమై నినందిస్తూ పసుపు జెండా అభ్యున్నతి ద్యేయంగా భావితరాల భవిష్యత్తు బాసటగా ప్రతి కార్యకర్తకు అండ దండగ నిలుస్తున్న విద్య శాఖమంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదిన సందర్భంగా వైకుంఠం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు . ఈ సంద్భంగా వైకుంఠం ప్రసాద మాట్లాడుతూ అడుగడుగునా అడ్డంకుల్ని, తీవ్రమైన అవమానాల్ని ఒంటిచేత్తో ఎదుర్కొంటూ, యువగళం-పాదయాత్ర ద్వారా పెనుసంచలనం సృష్టించి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి, ప్రత్యర్థుల గుండెలదిరేలా తన పదఘట్టనతో చీకటి పాలనను చీల్చిచెండాడి వెలుగుల రాజ్యం సృష్టించి, ప్రజాదర్బార్ ద్వారా రాష్ట్రప్రజల కష్టాలను కన్నీళ్ళను తుడుస్తూ, గత పాలనలో నిరాదరణకు గురైన యువతకు భరోసాగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి కోటి సభ్యత్వాల కుటుంబ సభ్యులను సమకూర్చి రాష్ట్ర భవిష్యత్తును తన భుజస్కందాలపైన వేసుకున్న నవతరం నాయకుడు మన లోకేశ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో హాలహర్వి జడ్పీటీసీ లింగప్ప, ఆస్పరి మాజీ ఎంపీపీ వెంకటేష్, కృష్ణ, సర్పంచు కిషోర్, రాజశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు శేషిగిరి, చౌలరెడ్డి,చిప్పగిరి కన్వినర్ వలి బాషా,హొళగుంద కన్వినర్ తిప్పయ, హెబటం విష్ణువర్ధన్ రెడ్డి, తోక వెంకటేష్, ఎర్రిస్వామి, Tac మెంబెర్ అట్టేకల్ చిట్టీ బాబు,దేవనకొండ కన్వినర్ విజయభాస్కర్ గౌడ్, ఉచరప్ప,మొలగవెల్లి శీనప్ప, గూళ్యం ప్రకాష్, లింగప్ప, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు &తదితరులు పాల్గొన్నారు.