పట్టిసీమ డీ- సిల్టెషన్ ఇనుక పాయింట్
1 min readఈ నెల 24వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి ఇసుక
జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి
ఒక టన్నుకు ధర 165/- డి-సిల్టేషన్ ఛార్జ్ గా నిర్ణయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ కె.వెట్రిసెల్వి వారిఅధ్యక్షతన స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పట్టిసీమ డీ- సిల్టెషన్ ఇనుక పాయింట్ నుంచి ఈ నెల 24వ తేదీ నుంచి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచేందుకుఇసుక కార్యకలాపాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పట్టిసీమ డీసిల్టేషన్ ఇసుక పాయింట్ నందు పడవల ద్వారా ఇసుకను తెచ్చుటకు గానుజిల్లా స్థాయి ఇసుక కమిటీ ఒక టన్నుకు ధరను రూ. 165/- డి-సిల్టేషన్ చార్జిగానిర్ణయించారు. అడ్మినిస్ట్రేషన్, జి.ఎస్.టి, తదితర చార్జీ లను కలుపుకొనీ వినియోగదారుని ధర ఒక టన్నుకు రూ. 198/-గా సమావేశంలో నిర్ణయించారు.పకడ్బందీగా సి.సి. కెమారాల నిఘా ద్వారా పట్టిసీమ డి-సిల్టేషన్ పాయింట్ కార్యకలాపాలు పర్యవేక్షించబడతాయన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.పట్టిసీమ డి సిల్టేషన్ ఇనుక పాయింట్ నందు పడవల లభ్యత వాటి సామర్ధ్యం ఆధారంగా రోజుకు 400 టన్నుల వరకు మాత్రమే ఇసుక ఉత్పత్తి మరియు సరఫరాకు పరిమితి విధించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి .ధాత్రి రెడ్డి, ఐ.టి.డి.ఏ,ప్రాజెక్టు అధికారి కె.రాములు నాయక్,ధవలేశ్వరం గోదావరి హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్ , ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్, గ్రౌండ్ వాటర్ ఉపసంచాలకులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇఇ, ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఆర్.టీ.వో లు, పోలవరం, కుక్కునూరు తహాసీదార్లు ,తదితర అధికారులు హాజరైయ్యారు.