అభినయ భారతి 30వ,జాతీయ నృత్యోత్సవాలు
1 min read

డిసెంబర్26,27,28 తేదీలలో ఘనంగా ఘనంగా నిర్వహణ
వ్యవస్థాపక కార్యదర్శి నాచార్య , లయన్ దువ్వి హేమ సుందర్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్యభారతి 30వ జాతీయ నృత్యోత్సవాలు,నృత్యపోటీలు 2025 డిసెంబర్ 26,27,28 తేదీలలో వై.ఏం.హెచ్.ఏ హాల్ నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య లయన్ దువ్వి హేమసుందర్, ఆహ్వాన సంఘం కార్యదర్సులు లయన్ లేళ్ల వెంకటేశ్వరరావు, దువ్వి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.ఉత్సవాల సందర్బంగా నిర్వహిస్తున్న నృత్యోత్సవాలకు సుమారు 10రాష్ట్రాల నుండి వివిధ శాస్త్రీయ నృత్య కళాకారులు విచ్చేస్తున్నారని, నృత్య పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 500మంది చిన్నారి నర్తకులు విచ్చేసి వారి ప్రతిభ కనపరచనున్నారని తెలిపారు.నృత్యకౌముది, సేవా తపస్వి, నృత్య తపస్వి వంటి అవార్డులతో పాటు గెలుపొందిన చిన్నారులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు, షీల్డ్స్ అందించనున్నారు.వివిధ కళాసంస్థలు, స్వచ్చంద సంస్థలు, కళాపోషకుల సహకారంతో నిర్వహించే ఈ ఉత్సవాల కరపత్రాన్ని హేలాపురి లయన్స్ క్లబ్ నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ పూర్వపు గవర్నర్ లయన్ మురళి మోహనరావు, మొదటి ఉప గవర్నర్ డా.డి.సుబ్బారావు, క్లబ్ అధ్యక్షులు బి.వి.వి. సత్యనారాయణ, కార్యదర్శి దుష్యంత్ చౌదరి, జోన్ చైర్మన్ కె.బి.రావు తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ శాస్త్రీయ నృత్య కళారూపాల సంరక్షణ కోసం హేమసుందర్ చేస్తున్న కృషి ప్రశంసించదగినదని, మన ఏలూరు నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్రతీ సంవత్సరం ఇవి నిర్వహించడం ముదావహమన్నారు.

