వృద్ధులకు కౌన్సిలర్ సుమలత అన్న ప్రధాత..
1 min readతిలకంతో సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని గీసిన చిత్రకారుడు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం జువ్వాజీ సుంకన్న గౌడ్ సేవా సమితిలో ఉన్న వృద్ధుల అనాధలకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ చౌడేశ్వరీ దేవి సేవ సమితి ఆధ్వర్యంలో పట్టణ 6వ వార్డు కౌన్సిలర్ దేశెట్టి సుమలత,9వ వార్డు మాజీ కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు వృద్ధులకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. సుమలత,శ్రీనివాసులు, కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి ముర్తుజావలి,పట్టణ టీడీపీ మహిళా నాయకులు డాక్టర్ వనజ వృద్ధులకు భోజనాన్ని వడ్డించారు.అంతే కాకుండా సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని వీర తిలకంతో వేశారు.తిలకంతో చిత్రాన్ని వేయడం పట్ల శ్రీనివాసులుకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.