విద్యార్థులను పశువుల వాహనాల్లోకి ఎక్కి స్తున్న రెయిన్బో పాఠశాల…
1 min readప్రాణాలను బిక్కుబిక్కు మంటూ అరచేతిలో పెట్టుకొని రెయిన్బో పాఠశాల వాహనాలను ఎక్కుతున్న విద్యార్థులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : నందవరం మండలం ఉన్నటువంటి రెయిన్బో పాఠశాల వాహనాలను విద్యార్థులను పరిమితికి మించి ఒక పశువుల్లాగా ఎక్కించుకోవడం జరిగింది ఆ వాహనాలను విద్యార్థి సంఘ నాయకులు ఆపి విద్యార్థులను దింపి వాహనాల ను నడిపేటటువంటి డ్రైవర్ పాఠశాల యాజమాన్యం తో విద్యార్థి సంఘ నాయకులు వాగ్వాదనికి దిగడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ మాట్లాడుతూ నందవరం మండలంలో ఉన్నటువంటి రెయిన్బో పాఠశాలలను సీజ్ చేయాలని రెయిన్బో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఒక పశువుల్లాగా చూస్తూ నారని అదేవిధంగా విద్యార్థుల ను పరిమితికి మించి ఎక్కించుకోవడం వలన జరగరానిది జరిగితే ఎవరు దీనికి బాధ్యులని యాజమాన్య స్వలాభం కోసం విద్యార్థులను ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం అంటే సిగ్గుచేటు అని విద్యార్థులు తల్లిదండ్రుల్లో దగ్గర వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ బుక్స్ ఫీజ్ అని యూనిఫామ్ ఫీజ్ అని పరీక్షల ఫీజు అని ఇతర ఫీజులతో కలిపి వేలకు వేలు వసూలు చేస్తూ విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కల్పించక పోవడం అంటే బాధాకరమని ఆ వాహనాల్లో విద్యార్థులు ప్రయాణించాలంటే తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎక్కడ జరుగుతుంది అని ఇంత జరుగుతున్నా కూడా విద్యాధికారులు మాత్రం పట్టించుకోకుండా ఉండడం అంటే విద్యా వ్యవస్థకే సిగ్గుచేటుఅన్ని వారు అన్నారు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పై విద్యాధికారులు రెయిన్బో పాఠశాలను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదేవిధంగా ఆర్టీవోఅధికారులు ఆ వాహనాలను సీజ్ చేయాలనీ వారు అన్నారు లేనిపక్షంలో ఈ సమస్య పైన ఉద్యమాలకు దారి తీస్తామని వారి హెచ్చరించారు.