‘గ్యాస్టిక్ ’ పై .. అవగాహన పెంచండి..
1 min readసర్జికల్ గ్యాస్ర్టో ఎంటరాలజి డా. సురేష్ కుమార్ రెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం పై అవగాహన లేక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు శ్రీ అశ్విని సూపర్ స్పెషాలిటీ సర్జికల్ గ్యాస్ర్టో ఎంటరాలజి డా. సురేష్ కుమార్ రెడ్డి. గురువారం పల్లెవెలుగు నూతన క్యాలెండర్ ను ఆయన ఛాంబరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయకపోవడం.. సమయానికి భోజనం చేయకపోవడం.. ఇష్టానుసారంగా మందు, ధూమపానం చేయడం తదితర దుర్వ్యసనాల కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కథనాలు రాయాలని ఈ సందర్భంగా డా. సురేష్ కుమార్ రెడ్డి సూచించారు.