ఏలూరు జిల్లా నూజివీడు దళిత మహిళకు అండగా బహుజన సేన
1 min readబాధిత దళిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్
పంచాయతీ అధికారికి వినతి పత్రం అందజేసిన సంఘ అధ్యక్షులు మత్తే బాబి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: చెక్కపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త వేధిస్తున్నాడని నా వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నాడని, జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రాన్ని దోమతోటి మార్త, బహుజన సేన అధ్యక్షులు మత్తే బాబి వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు అందజేశానని తెలిపారు.సర్పంచ్ భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.మా ఆత్మన్యూనతా భావం దెబ్బతీస్తున్నాడని గ్రామంలో సమాజంలో తలెత్తుకుని జీవించలేకపోతున్నా మానసికంగా చాలా ఆవేదనకు గురవుతున్నాననితనకు న్యాయం ఉన్నతాధికారులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.