ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి
1 min readఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి గా మార్చుకొనుటకు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని మండలం దానాపురం గ్రామంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి గా మర్చుకొనుటకు దరఖాస్తు చేసుకున్న వాటికి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… వ్యవసాయేతర భూమిగా మార్చుకొనుటకు నాలా యాక్ట్ ప్రకారం ఐదు శాతం రుసుము చెల్లించి ప్రభుత్వ నిబంధనలు తప్పకా పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉప తహశీల్దార్ గుండాల నాయక్, విఆర్వో రాజశేఖర్ గౌడ్, విలేజ్ సర్వేయర్ ఆసిఫ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.