PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫిబ్రవరి 1 నుండి 3 వరకు నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు

1 min read

30న పోలవరం నిర్వాసితుల సమస్యలపై సిపిఎం ప్రచార జాత

సీపీఎం రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ

పల్లెవెలుగు వెబ్  ఏలూరుజిల్లా ప్రతినిధి: ఫిబ్రవరి 1 నుండి 3 వరకు సిపిఎం 25వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి చెప్పారు. ఏలూరు పవర్ పేట లోని ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆ పార్టీ జిల్లా నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా  ఎ.రవి మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. మహాసభల ముగింపుగా ఫిబ్రవరి 3వ తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న  సమస్యలపై ప్రచార జాతాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై జరుగుతున్న ప్రచార జాత జిల్లాలో ఈనెల 30వ తేదీన పర్యటిస్తుందని, ఆజాత ఒకటవ తేదీకి నెల్లూరు చేరుకుంటుందని వివరించారు. సిపిఎం రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడమే కాకుండా ప్రజా ఉద్యమాల నిర్వహణకు దిశా దశ రూపొందించడం జరుగుతుందన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి పునరావాసం, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతోందని  చెప్పారు. విశాఖ ఉక్కు ప్రవేటేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, దళితులు, గిరిజనులు, యువజనులు, విద్యార్థులు, మహిళల సమస్యలపైన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సిపిఎం అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందని ఆ ఉద్యమాలను ప్రజలందరూ బలపరచాలని  కోరారు. సిపిఎం రాష్ట్ర 25వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. ఎన్.వి.డి. ప్రసాద్, ఆర్.లింగరాజు, కె.శ్రీనివాస్,పి.రామకృష్ణ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *