విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన నందవరం ఎంఈఓ ని సస్పెండ్ చేయాలి
1 min readవిద్యార్థుల పాలిట శాపంగా మారిన రైన్బో పాఠశాల
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : నందవరం మండలంలో ఉన్నారు రెయిన్బో పాఠశాలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ సుదర్శన్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని ఆర్ యు ఎస్ ఎఫ్,ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ మాట్లాడుతూ నందవరంలో ఉన్నటువంటి రెయిన్బో పాఠశాల ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించడం జరుగుతుంది విద్యార్థుల జీవితాల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపకుండా విద్యార్థులను ఒక బస్తా బ్యాగు లాగా వాహనాలలో కుక్కి విద్యార్థుల ప్రాణాలు పోయినా పర్వాలేదు మాకు మాత్రం కాసులు వస్తే చాలు అని ధీమా వ్యక్తం చేస్తున్న యాజమాన్యం అన్ని గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలైన మేము వివిధ రూపాల్లో సబ్ కలెక్టర్ మరియు డిప్యూటీ డిఇఓ కి కూడా కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేయగా డిప్యూటీ డిఈఓ విచారణ జరపండి అని నందవరం ఎంఈఓ కి పంపించడం జరిగింది కానీ ఆయన నామ మాత్రపు విచారణలు జరిపి రెయిన్బో పాఠశాలకు వత్తాసు పలకడం జరిగింది మేము ఫిర్యాదు చేసి 5రోజులు గడుస్తున్న కూడా ఇప్పటికీ ఆ వాహనాలలో విద్యార్థులను తిప్పుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికి అయినా జిల్లా విద్యాధికారులు స్పందించి ఏం ఈ ఓ పై విచారణ జరిపి విధులు నుంచి తొలగించలిని, రెయిన్బో పాఠశాల పై చర్యలు తీసుకోవాలి అన్ని వారు డిమాండ్ చేసారు. లేనిపక్షం లో ఆందోళన చేస్తామని తెలిపారు.