PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రవీంద్ర విద్యార్థులకు రాష్ట్ర బహుమతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలల విద్యార్థులకు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో  ఐడియా థాన్ 2K25 పేరుతో నిర్వహింపబడిన ఈ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా 175 జట్లు పాల్గొనగా కర్నూలు నగరంలోని రవీంద్ర బాలికల పాఠశాల (RPS)  విద్యార్థినులు హఫీఫా, సమీరా, లిఖిత లు ఉత్తమ ప్రతిభ కనపరిచి టాప్ టెన్ లో నిలిచారు. వీరు డ్యూయల్ పర్పస్ వీల్ చైర్ స్ట్రెచర్  బెడ్ ఫర్ హాస్పిటల్స్ అనే నమూనాను తయారుచేసి ఈ విజయాన్ని సాధించారు. అలాగే రవీంద్ర ఐ సి విభాగం నుండి ఆదిత్య,స్నేహిల్,గురువీరచరణ్ లు రూపొందించిన  ఉమెన్ సేఫ్టీ డివైస్ అను నమూనాకు నగదు  బహుమతిని పొందడం జరిగింది. ఈ రెండు నమూనాలకు ఫండింగ్ ఇవ్వడం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ అద్భుత ప్రతిభ కనబరిచి, విజయాన్ని సొంతము చేసుకున్న ఈ విద్యార్థులను రవీంద్రా విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య , రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ జి వి ఎం మోహన్ కుమార్ , అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ , వైస్ చైర్మన్ జి. వంశీధర్ లు అభినందించారు. వీరు విద్యార్థులతో ముచ్చటిస్తూ భవిష్యత్తులో మీ పరిశోధనలను ఇంకా అభివృద్ధి పరుస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉంటూ, పేద ప్రజలకు ఉపయుక్తంగా ఉండే సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. ఈ విజయాన్ని సాధించడానికి సహకరించిన ఏటీయల్ ఇంచార్జ్ వి.రమేష్ రంజిత్ కి , అన్ని విధాలా తమకు అండగా నిలిచిన విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *