నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం హౌస్ క్లీనర్ పదవి విరమణ
1 min read46 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించడం అభినందనీయం
కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
ప్రసాద్, బేబీ సరోజిని దంపతు లను సత్కరించిన పలువురు అధికారులు,కుటుంబ సభ్యులు,స్నేహితులు, బంధుమిత్రులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అయినటువంటి హెడ్ వాటర్ వర్క్స్ (పంపుల చెరువు) లో పంపు హౌస్ క్లీనర్ గా పనిచేసే శుక్రవారం పదవి విరమణ పొందిన జన్యావుల ప్రసాద్, బేబీ సరోజినీ దంపతులను ఏలూరు కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. ప్రసాదు 18 సంవత్సరాల వయసులో పంపులు చెరువులో పంప్ హౌస్ ఎన్ఎంఆర్ గా ఉద్యోగం లో చేరి 43 సంవత్సరాల 11 మాసాలు ఎటువంటి రిమార్క్ లేకుండా సుదీర్ఘ కాలం ఉద్యోగం చేసి 2025 జనవరి 31 న ఉద్యోగ విరమణ చేయటం చాలా గొప్ప విషయం అని ఎస్ ఎన్ ఆర్ పెద్ద బాబు పేర్కొన్నారు. పంపుల చెరువులో పనిచేయడం కత్తి మీద సాము లాంటిదని అటువంటి విభాగంలో 44 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయటం నిజంగా అభినందించ తగ్గ విషయమని పెదబాబు పేర్కొంటూ ప్రసాదు తమ రిటైర్మెంట్ కాలమును ప్రజాసేవకు వినియోగించాలని ఆయన కోరారు. జన్యావుల ప్రసాద్ సత్కార సభకు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు, ది జోనల్ ము న్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రసాద్ తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ యూనియన్ కార్యకలాపాలలో చురుకైన పాత్ర వహించారని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రసాదు తమ శేష జీవితం కుటుంబ సభ్యులతో పాటు యూనియన్ కార్యకలాపాలకు వినియోగించాలని వెంకటేశ్వరరావు కోరారు. ప్రసాద్ సత్కార్ సభలో ఏలూరు కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. సురేంద్రబాబు, డి.ఈ.ఈ తాతబ్బాయి,రజాక్ లు, ఏ.ఈ.ఈ సాంబశివరావు, ఎం సాయి, టి అరుణ్ కుమార్ లు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బి నారాయణరావు, ఎస్ఎంవి సుబ్బారావు, మధ్యాహ్నపు దుర్గారావు, ట్యాప్ ఇన్స్పెక్టర్ సిహెచ్ హరినాథ్ బాబు పిట్టర్లు నారా శీను, బి దుర్గాప్రసాద్ అకౌంటెంట్ లింగేశ్వరి, పి రమేష్ ,విశ్రాంత డి.ఈ అచ్యుత రామారావు, విశ్రాంతి ఏఈ సాయి ప్రసాద్, విశ్రాంతి ట్యాప్ ఇన్స్పెక్టర్ లు బి.రాజు, పివి రమణ, బి నాగేశ్వరరావు ఉద్యోగ సిబ్బంది, బంధు మిత్రులు ప్రసాద్ ను శలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించారు. పంపుల చెరువు ఉద్యోగ సిబ్బంది, ఎస్ ఆర్ వన్ ఉద్యోగ సిబ్బంది, ఎస్ ఆర్ టు ఉద్యోగ సిబ్బంది ప్రసాద్ ను సత్కరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మరియు అకౌంటెంట్ పిఎఫ్ చెక్కును ప్రసాద్కు అందించారు. కార్పొరేషన్ నుంచి రావలసిన మిగిలిన సొమ్మును తొందరగా ప్రసాద్ కు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. తనకు జరిగిన సత్కారానికి జన్యావుల ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.