PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ్ఞాన పీఠంలో సామూహిక అక్షరాభ్యాసం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ నగర శివారులోని విజ్ఞాన పీఠం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం వైభవంగా జరిగింది. జి పుల్లారెడ్డి నగర్ లో గత సంవత్సరం ప్రారంభింపబడిన ఈ పాఠశాలలో 2-2-2025 తేదీ ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా  సరస్వతి ఆవాహన, పూజ,  హోమములో సుమారుగా 65 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు .పూజా కార్యక్రమం తర్వాత జరిగిన సభలో పాఠశాల కరస్పాండెంట్  శ్రీ పి పి గురుమూర్తి  మాట్లాడుతూ 50 సంవత్సరాలకు పైగా ఈ పరిసర గ్రామాలలో విద్యాపరంగా విజ్ఞాన పీఠం సేవలు చేస్తూ ఇటీవలనే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సేవా దృక్పథంతో ప్రారంభం చేసి ముందుకు సాగుతున్నామని, ఈ పనిలో అందరి సహకారాన్ని కోరుతున్నామని కూడా తెలియజేశారు. ముందుగా ఈ సంవత్సరం ఏడవ తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపును పొంది నడుస్తున్నదని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాణిక్య రెడ్డి, శ్రీ వి సుబ్రహ్మణ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ,శ్రీరామ గోవిందప్ప ,శ్రీ చంద్రమోహన్, శ్రీ రణధీర్ రెడ్డి, శ్రీమతి రేణుక, శ్రీమతి స్వర్ణలత తదితరులు పాల్గొని ప్రసంగించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *