బిసి సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : విజయవాడ నగరంలో ఆర్ ఆర్ కన్వక్షన్ హాల్ లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న మాట్లాడుతూ పది శాతం మంది ఉన్న అగ్రవర్ణాలు చట్టసభల్లో 90 శాతం ఉన్నారు. బిసిలకు జనాభా లెక్కల ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు క్రాంతి కుమార్ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులు కోత్తపల్లి దేవేంద్ర నాగశేషు యాదవ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు అన్ని జిల్లాల అధ్యక్షుడు బిసి సోదర సోదరిమణులు పాల్గొన్నారు.