కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ శనివారం ఏలూరు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పెదపాడు గ్రామంలో నివసిస్తున్న ఎస్టీ కులానికి చెందిన వారు తమ ఇళ్లు నిర్మాణానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారని, సదరు సమస్యను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా కోరుతూ వడిత్యా శంకర్ నాయక్ వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి అందజేశారు. పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఐటిడిఏ ఎపివో పి.ఎస్. శ్రీనివాస నాయుడు, ఏలూరు అర్బన్ తహశీల్దారు జి.వి. శేషగిరి ఉన్నారు.