షేక్ సయ్యద్ బాజీ కి గౌరవ డాక్టరేట్
1 min readడాక్టరేట్ బిరుదు అందుకోవటంతో షేక్ నూర్ భాషా ముస్లిం సంఘ నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రశంసలు
పలువురు స్థానిక ప్రముఖులు, నూర్ భాషా సంఘ పెద్దలు సత్కారం
వృద్ధ, పేదమహిళలు, నిత్యవసర వస్తువులు పంపిణీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: స్థానిక అశోక్ నగర్ లో షేక్ నూర్ భాషా ముస్లిం నగర యువకులు, స్థానిక పెద్దలు సంఘ పెద్దలు డాక్టరేట్ పట్టా పొందిన షేక్ సయ్యద్ బాజీ (గాజులబాజి)ని పలువురు షేక్ నూర్ భాషా ముస్లింలు, యువకులు, స్థానిక పెద్దలు ఘనంగా సత్కరించారు. ది న్యూ లైఫ్ థియాలజికల్ ఆఫ్ యూనివర్సిటీ హైదరాబాద్ వారిచే ఫౌండర్ ఛైర్మెన్ బిషఫ్ రెవ.డాక్టర్ జోసెఫ్ పాలంగి చీఫ్ గెస్ట్ శామ్యూల్ అర్టూఉర్, తదితరులు ప్రముఖులు చేతులు మీదుగా వివిధ రంగాలలో వివిష్ట సేవలు అందించిన వారికీ యూనివర్సిటీ వారు డాక్టరెట్ బిరుదులతో సత్కరించారు, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూరుభాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన రాష్ట్ర కమిటీ లోను మరియు జాతీయ దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరమ్ కమిటీ ద్వారా మరియు వివిధ రంగాలలో ఎన్నో సేవలు అందించిన ఏలూరుకు చెందిన షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ )కి ” ది న్యూ లైఫ్ దియాలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారు, హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏలూరు గాజుల బాజీ కి, ఆయన చేసిన సేవలు గుర్తించి గౌరవ డాక్టరేట్ బిరుదు ఇచ్చి, మోడల్, సర్టిఫికెట్, మెమోంటో, శాలువాతో యూనివర్సిటీ ఛాన్సలర్, ప్రముఖులు,పెద్దలు, తదితరులు ఘనంగా సత్కరించారు, దానిలో భాగంగా ఆదివారం ఏలూరు స్థానిక అశోక్ నగర్ ప్రాంతంలో షేక్ నూర్ భాషా ముస్లిం యువకులు, పలువురు ముస్లింలు, ముస్లిం సంఘ పెద్దలు, స్థానిక ఏరియా పెద్దలు మరియు శ్రేయోభిలాషులు బాజీని శాలువాకప్పి, పూల బొకేలు అందించి ఘనంగా సన్మానించారు.వారు మరెన్నో ఉన్నత పదవులు, గౌరవ సత్కారాలు, బిరుదులు అందుకోవాలని ఆకాంక్షించారు. షేక్ సయ్యద్ బాజీ కి డాక్టరేట్ రావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు చరవాణిల ద్వారా మరియు స్వయంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని వీర వెంకట సత్య వరప్రసాద్, గాదం వెంకట రామకృష్ణ, షేక్ కమాల్, షేక్ మబూబ్ సుభాని, షేక్ బాషా, షేక్ బాజీ, మస్తాన్, ఫరీద్ తదితర నూర్ భాషా పెద్దలు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.