ప్రభుత్వ బాలికల హై స్కూల్ మెనూ పాటించని ఏజెన్సీపై చర్యలు తీసుకోండి
1 min readనాసిరక నిత్యవసరల సరుకులతో భోజనం చేస్తున్న ఏజెన్సీ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి,తక్షణమే వంట ఏజెన్సీ ను తొలగించాలి: ఏఐఎస్ఎఫ్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలోని మాచాని ప్రభుత్వ బాలికల హై స్కూల్ లో మధ్యాహ్నం భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీ మెనూ పాటించకుండా, నాసిరకంగా నిత్యవసర సరుకులతో విద్యార్థినీలకు భోజనాలు తయారు చేస్తున్నారని కాబట్టి తక్షణమే ఏజెన్సీ పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఏజెన్సీని తొలగించాలని ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు విష్ణు,ఏఐఎస్ఎఫ్ తాలూకా సహాయ కార్యదర్శి దస్తగిరి డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక పట్టణంలో మాచాని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద వంట ఏజెన్సీ మారిచి అధికార పార్టీ కి వారికి అప్పగిస్తే వారు విద్యార్థుల కడపులు మాడ్చి ప్రభుత్వం ప్రకటించిన మెనూ ద్వారా విద్యార్థినిలకు భోజనాలు పెట్టకుండా,ఏజెన్సీ సొంతంగా తయారుచేసిన మెనూ ద్వారా మధ్యాహ్నం భోజనాన్ని వండించడం జరుగుతుందని, అది కూడా నాణ్యత లేనటువంటి సరుకులతో తయారు చేయడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ సొంత మెనూ ద్వారా భోజనాలు తయారుచేయడం ఏమిటని ప్రశ్నిస్తే, మధ్యాహ్నం భోజనం పథక ఏజెంట్స్ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి నీ అక్కడ ఉన్నవారు చెప్పడం జరిగింది. ఈ నాసిరక భోజనాలు తింటే విద్యార్థినీలు అనారోగ్యం పాలు అవుతారు అని కాబట్టి సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే మేల్కొని ఈ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీని తొలగించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారిచరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకుల శ్రీను, రాఘవేంద్ర, నాయుడు, అంజి, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.