సీఎం సారథ్యంలో రైతులు అధైర్య పడొద్దు..
1 min readరోడ్డు డ్రైనేజీ పనులు పూర్తి చేయండి:ఎమ్మెల్యే గౌరు
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.సోమవారం ఉదయం ఓర్వకల్లు మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చరితారెడ్డి ప్రారంభించారు.మార్క్ ఫెడ్ వారి కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర 7,550 రూ.లు ఉందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రైతులు ఎవరూ అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో మార్కెట్లో ధర పెరిగితే అదే ధరలకు రైతుల వద్ద నుండి కొంటారని అదేవిధంగా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు.తర్వాత ఓర్వకల్లులో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వైపున గల డ్రైనేజీ కల్వర్టు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ డ్రైనేజీ పనులను త్వరితగతన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు,డీసీఓ జాఫ్రిన్,టీడీపీ మండల కన్వీనర్ డి.గోవింద రెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఉపాధ్యక్షులు నార్ల మోహన్ రెడ్డి,మండల నాయకులు లక్ష్మీకాంత రెడ్డి,రామ భూపాల్ రెడ్డి,కన్నమడకల సుధాకరయ్య,మైనార్టీ నాయకులు అన్వర్ మరియు అధికారులు పాల్గొన్నారు.