సమాచార హక్కు చట్టాన్ని.. వినియోగించుకోండి
1 min readమున్సిపాలిటీ కమిషనర్ బేబీ..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సమాచార హక్కు చటాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మూడవ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన 2005- సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని-2005 లో తీసుకువచ్చారని ఏ శాఖలో అయినా సరే మీకు పూర్తి వివరాలు కావాలంటే ఒక దరఖాస్తు ద్వారా సమాచారం అడగవచ్చని మీరు అడిగిన సమాచారం మేరకు ఆ శాఖ అధికారులు పూర్తి సమాచారం మీకు అందజేయాల్సి ఉంటుందని అన్నారు.ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేయవద్దని మున్సిపాలిటీ కమిషనర్ బేబీ ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్ఓ మధు బాబు,పట్టణ ప్లానింగ్ అధికారి రంగస్వామి,డీఈ నాజిర్,సీనియర్ అసిస్టెంట్ విష్ణువర్ధన్ రెడ్డి,జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు మరియు ప్రజలు పాల్గొన్నారు.