నిలిపివేసిన క్లాఫ్ ఆటో డ్రైవర్లను,కార్మికులను విధుల్లోకి వెంటనే తీసుకోవాలి
1 min readభారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్ టియు) అధ్యక్ష ,కార్యదర్శులు డిమాండ్
పనిచేస్తున్న క్లఫ్ డ్రైవర్లను తొలగించటం చట్టవిరుద్ధం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా నిలిపి వేసిన క్లాప్ ఆటోలను, మరియు డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.వి రమణ, బద్దా వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నెల ఒకటో తేదీ నుండి నిలుపు వేసిన క్లాప్ ఆటో డ్రైవర్లను, మరియు క్లాప్ ఆటోలను తిరిగి విధులకు తీసుకోవలసినదిగా ప్రభుత్వాధికారులకు ప్రభుత్వానికి సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నామన్నరు. కార్మికులకు ఉద్యోగం కల్పించిన ప్రభుత్వము ఆ ఉద్యోగాలను కొనసాగించవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉంటాదని,వారిని తొలగించడం అంటే చట్టరీత్యా నేరమని, వారికి ఉపాధి భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ నీదే ,అటువంటి బాధ్యతను మరిచి నిరంతరం ప్రజల వద్దకు ఇండ్ల దగ్గరకు వెళ్లి చెత్త కలెక్షన్ చేయించి తీసుకువచ్చేక్లాప్ లను రద్దు చేయడం క్లాప్ డ్రైవర్స్ ను తొలగించడం ప్రజలకు అసౌకర్యం కల్పించడమే ఇదొక నిదర్శనమని తెలియజేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి కార్పొరేషన్ కార్మికులుగా పనిచేస్తున్న క్లప్ డ్రైవర్లను తొలగించడం చట్ట విరుద్ధమని తొలగించిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, నిలిపివేసిన క్లాప్ లను కొనసాగించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాము. కార్మికుల ఉపాధి సమస్య పరిష్కరించే దిశగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని లన్నారు. వారు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మేము సంఘీభావం తెలియజేస్తామని వారి ఉద్యమంలో మా పాత్ర కూడా ఉంటాదని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నరు.