భవిత కేంద్రం టీచర్లకు..షోకాజ్ నోటీసులు జారీ
1 min readఏపీసీ పాఠశాలల ఆకస్మిక తనిఖీ..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని సంత గేట్ భవిత కేంద్రంలో ఉన్న ఉపాధ్యాయులకు నంద్యాల జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్ ప్రేమంత కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నందికొట్కూరు ఎంఈఓ పి సుభాన్ తెలిపారు.సోమవారంనంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం భవిత కేంద్రాన్ని ఏపీసీ ప్రేమంత కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.తనిఖీ సమయంలో ప్రత్యేక అవసరాలు గల భవిత కేంద్రం ఐఈఆర్టీ లు విజయ కుమారి,రవిబాబు విధుల్లో లేరని అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజర్ అయినందుకు గాను షోకాజ్ నోటీస్ లు జారీ చేసినట్లు ఎంఈఓ తెలిపారు. తర్వాత ఏపీసీ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల ఉర్దూ పాఠశాలను,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉర్దూ విద్యా నగర్ పాఠశాలను తనిఖీ చేశారు.ఆయా పాఠశాలల్లో తరగతి గదులను పరిశీలించి పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అదే విధంగా మండలంలోని కోనేటమ్మపల్లె గ్రామంలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి లలిత కుమారి,ఉర్దూ పాఠశాల యూనస్ భాష పాల్గొన్నారు.