దుమ్ము..దూలికి చెక్ .. నీటి ట్యాంకర్ తో రోడ్ల పై నీటి విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల కేంద్రంలో సోమవారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది, రంగమ్మ అలాగే పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల విన్నపంతో రోడ్ల పైన సైకిల్ మోటార్లు వాహనాలు తిరగడం వల్ల దుమ్ము, డస్ట్,ఎక్కువగా ఉండడంతో ప్రజలకు,రోగాల బారి నుండి పడకుండా,స్థానిక బస్టాండ్ నుంచి, మెయిన్ రోడ్డు స్థానిక వాల్మీకి సర్కిల్ వరకు నీటి ట్యాంకర్ తో రోడ్ల పైన నీటిని వదిలారు అలాగే, ఆరవ వార్డ్ లో ఉండే కాలనీ వాసులకు నీటి ఎద్దడి ఎక్కువ ఉండడంతో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని, ఆరో వార్డ్ మెయిన్ రోడ్ లో ఉండే చేతి పంపుకు మోటార్ పంపు బిగించారు ప్రజలకు వీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టారు అనంతరం కాలనీ వాసులు మోటార్ బిగించిన శుభ సందర్భంగా సర్పంచ్ కి మరియు కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చలవది పంపాపతి మోటార్ మెకానిక్ ఫయాజ్ పాల్గొన్నారు.