క్రెడో పాఠశాలలో రథ సప్తమి సందర్భంగా సామూహిక సూర్య నమస్కారాలు
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని క్రెడో పాఠశాల నందు మంగళవారం ఉదయం 8-00 గంటలకు సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, పాఠశాల యాజమాన్యం టి. శ్రావ్యలక్ష్మీ, ఎస్.బి.కార్తిక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు విద్యార్థులలో జ్ఞాపకశక్తి, దేహం పటుత్వం కలుగుతుందని ఈ కార్యక్రమాలు తితిదే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగార్జున, నిర్మల, హసీనా, సాయిశ్రీ, శశికళ, సుశీల తదితరులు పాల్గొన్నారు.