PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ ఆరోగ్యశ్రీ’ని సద్వినియోగం చేసుకోండి

1 min read

– ప్రభుత్వ చీఫ్​ విప్​ శ్రీకాంత్​ రెడ్డి
ల్లెవెలుగు రాయచోటి : పేదలకు కార్పొరేట్​ స్థాయిలో వైద్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్​ విప్​ శ్రీకాంత్​ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం రాయచోటిలోని అమరావతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిని సందర్శించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విప్​ శ్రీకాంత్​ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా సర్జరి చేసుకున్న రోగి కోలుకునే వరకు ఆర్థికంగా ఇబ్బంది పడరాదన్న ఉద్దేశంతో రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ. 5వేలు రోగి ఖాతాలో జమ అవుతుందన్నారు. అంతేకాక సాధారణ కాన్పుకి రూ.5వేలు, సిజేరియన్​కు రూ.3వేలు, యాక్సిడెంట్​లో ఎముకలు విరిగిన వారికి రూ. 10వేలు , అపెండిక్స్​ కు రూ. 5వేలు … ఇలా వైఎస్సార్​ ఆసరా ద్వారా అందిస్తోందన్నారు. అనంతరం ప్రభుత్వ విప్​ శ్రీకాంత్​ రెడ్డిని ఆస్పత్రి యాజమాన్యం సన్మానించింది.

కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్​ బాబు, ఎమ్మెల్సీ జాకియా ఖానం, రాయచోటి డిఎస్పి శ్రీధర్ ,మునిసిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, సిఐలు రాజు ,రూరల్ సీఐ లింగప్ప మరియువైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి రాజు. మాజీ జెడ్పిటిసి దేవ నాథ్ రెడ్డి , ఆర్ టి యు గౌరవ అధ్యక్షుడు కోండూరు శ్రీనివాస రాజు, అమరావతి హస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కోండూరు ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author