PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లాకే గర్వకారణం..

1 min read
  • ​​​ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరి జనరల్​గా హృదయరాజు ఎన్నిక.. అభినందనీయం
  • వి.సిహెచ్. వెంగళరెడ్డి, జిల్లా ఛైర్మన్, ఏపి జెఏసి
  • పల్లెవెలుగు వెబ్​: ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (APJAC) రాష్ట్ర సెక్రెటరీ జనరల్ గా APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు ఎన్నిక కావడం కర్నూలు జిల్లాకే గర్వకారణమన్నారు ఏపి జెఏసి జిల్లా ఛైర్మన్, వి.సిహెచ్. వెంగళరెడ్డి అన్నారు. APTF రాష్ట్ర అధ్యక్షులు, కర్నూలు జిల్లా వాసి జి.హృదయ రాజు .. (APJAC) రాష్ట్ర సెక్రెటరీ జనరల్ గా ఎన్నికైన సందర్భంగా ఆదివారం కర్నూలు డ్రైవర్స్​ అసోసియేషన్​ కాన్ఫరెన్స్​ హాల్​లో APTF జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మాధవ స్వామి , యస్.ఇస్మాయిల్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ జెఏసి జిల్లా ఛైర్మన్ వి.సిహెచ్. వెంగళరెడ్డి మాట్లాడుతూ ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరి జనరల్​గా హృదయరాజు ఎన్నిక కావడం కర్నూలు జిల్లాకే గర్వకారణమన్నారు. హృదయరాజు నాయకత్వంలో రాష్ట్రంలోని 8లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మిక మరియు పెన్షనర్స్ కు సంబంధించిన డిమాండ్లను సాధించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం APTF జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.కమలాకర రావు , 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు & ఏపి జెఏసి కో – చైర్మన్ గోపాల కృష్ణ , APTF రాష్ట్ర సహద్యక్షులు కె.కులశేఖర రెడ్డి, ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు, యస్ టి యు రాష్ట్ర సహాద్యక్షులు హెచ్.తిమ్మన్న , డి టి యఫ్ రాష్ట్ర నాయకులు కె.రత్నం యోసేపు లు మాట్లాడుతూ నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అర్థంగాని విద్యావిధానం ను తీసుకొస్తుందని, దీని వల్ల విద్యార్థులు డ్రాపౌట్ లుగా మారే పరిస్థితి , DSC రిక్రూట్మెంట్ లేకుండా చేసే విధానం చేస్తున్నారని దీనిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
  • సమావేశంలో PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధి మూర్తి, ఏపి డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రావు, ఏపీ జెఏసి జిల్లా సెక్రెటరీ జనరల్ జవహర్, UTF జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, APTF 257 జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న, HM అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఓంకార్ యాదవ్, APUS రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, RUPP జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, పీఈటి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జోసెఫ్ లక్ష్మయ్య, BTA నాయకులు రామశేషయ్య, సిటీ ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు కాశన్న, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మద్దిలేటి,MEO సంఘ నాయకులు మౌలాలి, శ్రీనివాసులు, APTF అనంతపురం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథ రెడ్డి, రవీంద్ర, APTF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబ శివుడు, గఫార్, టీవీ రామకృష్ణ, ఏపి సోషియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్, APTF జిల్లా సబ్ కమిటీ, రాష్ట్ర కౌన్సిలర్స్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, రచయితలు ఇనాయతుల్లా, మొహమ్మద్ మియా తదితరులు పాల్గొని ప్రసంగించారు.

About Author