శరీరంలోనే కొత్త వేరియంట్లకు బీజం !
1 min readపల్లెవెలుగు వెబ్: శరీరంలో ప్రవేశించాక వైరస్ జన్యుక్రమంలో జరిగే మార్పులు .. కొత్త వేరియంట్లలోనూ కనిపిస్తున్నాయని భారత శాస్త్రవేత్తలు తేల్చారు. బాధితుడి శరీరంలో ఉన్నప్పుడు వైరస్ లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వార .. దాని మనుగడకు కీలకంగా మారే , అవరోధంగా తయారయ్యే భాగాలను గుర్తించడానికి వీలవుతుందన్నారు. పరిశోధనలో హైదరాబాద్ కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు కూడ పాల్గొన్నారు. ఉత్పరివర్తన అనేది వైరస్ జీవన చక్రంలో చాలా సాధారణ విషయమని, మానవ కణంలో వైరస్ తన ప్రతిరూపాలను సృష్టించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్రమంలో కొత్త వైరస్ ప్రతిరూపాల్లోని న్యూక్లియోటైడ్లలో స్వల్ప మార్పులు తలెత్తుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.