PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలుడి పై పిచ్చి కుక్క దాడి

1 min read

కుక్కదాడిలో గాయపడిన ఫారాహారూన్

పల్లెవెలుగు వెబ్  హొళగుంద: మండల కేంద్రం హొళగుంద ఈబీసీ కాలనికి చెందిన ఫారా హారూన్ అనే మూడున్నరేళ్ల బాలుడిని శనివారం పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగ గాయ పరిచింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడి పై ఉన్నట్టుండి పిచ్చికుక్క దాడి చేయడంతో తల, వీపు, చేతులకు తీవ్ర రక్త గాయ లైయ్యాయి. వెంటనే కుటుంభ సభ్యులు బాలుడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్ బింధుమాధవి బాలుడికి ర్యాబీస్, టీటీ ఇంజెక్షన్లు వేసి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆదోనికి రెఫర్ చేసారు. ఇటీవల కాలంలో కుక్కల బెడద తీవ్ర మైందని కొద్ది రోజుల క్రితం పంచాయతీ అధికారులు కుక్కలను పట్టే వారిని రప్పించినా వారు నామమాత్రంగా కుక్కలను పట్టుకుని దగ్గర్లో వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఆ కుక్కలు మళ్లీ గ్రామంలోకి వచ్చి కనబడిన వారి పై దాడులు చేస్తున్నామని వాపోయారు. వెంటనే అధికారులు కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరతున్నారు.

About Author