టీజీ భరత్ గెలిస్తేనే నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తు.. టిడిపి నేతలు
1 min readటిడిపిలో చేరిన జొహరాపురంకు చెందిన నిరుద్యోగ యువకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయం సాధిస్తేనే నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు వై.వి రమణ, ఎం.వి నారాయణ అన్నారు. కర్నూల్ నగరంలోని టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జోహారపురంకు చెందిన 70 మంది యువకులు టిడిపి నాయకులు వై.వి రమణ, ఎం.వీ నారాయణ ఆధ్వర్యంలో రాజు నాయకత్వంలో కర్నూల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి నేత టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టిడిపి నాయకులు వైవి రమణ, ఎం వి నారాయణ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని కోరారు. కర్నూలు ఎమ్మెల్యేగా టీ.జీ. భరత్ విజయం సాధిస్తే ఆయనకున్న పరిచయాలతో కర్నూల్ నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జొహరాపురం చెందిన నిరుద్యోగ యువకులు టిడిపి అభ్యర్థి టీజీ భరత్ విజయమే లక్ష్యంగా టిడిపిలో చేరడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని వారు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ తన విజయం కోసం యువకులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం అభినందనీయమని చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు .