పంట ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): పొగాకు పంటను ధ్వంసం చేసిన వారిపై బాపనపల్లె జయరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్.ఓబులేష్ తెలిపారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన బాపనపల్లె జయరాజు కు చెందిన పొలం గుడిపాడు గ్రామ పొలిమేరలో ఉంది.రుద్రవరం మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన వారు గత నెల 28 వ తేదీ రాత్రి 2 ఎకరాల 25 సెంట్ల పొలంలో ట్రాక్టర్ రొటేటర్ తో పొగాకు పంటను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.రెడ్డి పల్లె గ్రామానికి చెందిన బాపనపల్లె సంజమ్మ,ఈమె కుమారులు విజే యుడు,ఆనంద్ తమ్ముడు సంజీవ రాయుడు పై కేసు నమోదు చేసినట్లు అదేవిధంగా ఈ కేసును విచారిస్తున్నామని వీటిలో ఎవరెవరి పాత్ర అయితే ఉందో చట్టపరంగా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఓబులేష్ అన్నారు.