PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు విరాళంగా 5 లక్షల చెక్కు సీఎంకి అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: విజయవాడలో అధిక వర్షాల కారణంగా వరదల్లో బాధితులుగా చిక్కుకున్న విజయవాడ వరద బాధిత ప్రజల సమస్యలను గమనించిన ఆలూరు నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి వారి సహాయానికై తమకు కలిగిన ఆలోచనని ఆచరణగా హొళగుందలోని గ్రామ పెద్దలు,యువతలను కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరిని ఏకతాటిక తీసుకొచ్చి చెయ్యి చెయ్యి కలిపి చేయూతను కల్పించే ధృఢ సంకల్పంతో  విజయవాడ వరద బాధితుల కోస గత వారం రోజుల నుండి హోళగుంద మండలంలో వాడవాడల సాగిన విరాళాల సేకరణతో ఆదర్శంగా వివిధ గ్రామాల దాతలు సైతం సంయుక్తంగా పాలు పంచుకున్నారు.విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన నగదు, బియ్యం విరాళాలు 04 లక్షల రూపాయలు సేకరణ కాగా ఉద్యమ సాయుధులుగా ఆలూరు నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు చిన్నహ్యాట శేషగిరి 50 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.అదేవిధంగా హెబ్బటం టిడిపి యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి 50 వేల రూపాయల విరాళాలని అందించారు.కాగా విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన మొత్తం నగుదు అక్షరాల 05 లక్షల రూపాయలను మంగళవారం రోజున అమరావతి సెక్రటేరియట్ (CMO) క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ!! శ్రీ.నారా చంద్రబాబు నాయుడు చేతులకు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది._రాష్ట్ర విపత్తులో మానవీయ సంకల్పంతో విరాళాలను అందించన దాతల సేవా సహృదయాన్ని మరియు విరాళాల సేకరణ బృందపు సమైఖ్య కార్యాచరణను ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా అభినందించారు.విజయవాడ వరద బాధితుల కోసం  తమవంతుగా తమకు తోచిన సహాయాన్ని అందించిన హోళగుంద మండల ప్రజలకు మరియు సమైఖ్య పిలుపుకు సాయుధులై కదిలి విరాళాలను సేకరించించిన బృందానికి హోళగుంద వరద బాధితుల సహాయ సమాఖ్య తరఫున అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల కన్వీనర్ అశోక్ హోళగుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలపై గర్భిణీలకు కాన్పులకు సంబంధించి స్కానింగ్లకు సంబంధించి పరికరాలను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు దిడ్డి తిక్కస్వామి బోయ వాల్మీకుల చిరకాల కోరిక ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్లిమ్ మైనారిటీ వ్యతిరేక వక్ఫ్ బోర్డ్  ఆమెండ్మెంట్ -2024 సవరణ చట్టాన్ని వ్యతిరేకంచి రద్దు చేయాలని ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్ బాషా, సుభాన్  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ!!శ్రీ.నారా చంద్రబాబు నాయుడు కిసమగ్ర సమాచార వివరణలతో వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ మండల కార్యదర్శి మల్లికార్జున మండలానికి విద్యార్థులకు మరియు మండల యువతకు ఆడుకోవడానికి ఒక 04 ఎకరాలలో ఆట స్థలాన్ని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా టిడిపి నాయకులు బుడగ జంగం లక్ష్మన్న బుడుగ జంగాల కులస్తులకు ఎస్సి రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయ సమైక్య బృంద నాయకులు గ్రామ పెద్దలు, మైనారిటీ నాయకులు, టిడిపి యువ నాయకులు విద్యార్థి యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *