అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
1 min readరైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనపడవా అంటున్నారు ప్రజలు
కే తిమ్మాపురం లో విషాదం
పురుగుల మందు తాగి బలవన్మరణం
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురం గ్రామానికి చెందిన బిజి కిస్టన్న , బిజి లక్ష్మి దంపతుల కుమారుడు రైతు బోయ గుడిసే రంగన్న( 39) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.రాత్రి సమయంలో ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురం గ్రామంలో బిజీ రంగన్న తన సొంత వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి అపమారక స్థితిలో పడి ఉన్నాడు. గ్రామస్థులు గమనించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆరోగ్య పరిస్తితి విషమంగా మారడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కోలుకోలేక తుది శ్వాశ విడిచాడు. రంగన్న కు 2 ఎకరాలు సొంత భూమి తో పాటు మరో 5 ఎకరాలు కౌలు కు తీసుకొని సాగు చేస్తున్నాడు.పంటలు పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయ పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక మనోవేదన కు గురై తనువు చాలించాడు. దాదాపు 5 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. రంగన్న కు బార్య లక్ష్మి తో పాటు కుమారుడు జానకిరాముడు( 14) ,కుమార్తె మంజుల( 12) అన్నారు.అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న బిజి రంగన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కే తిమ్మాపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.